పోస్టల్ కాలనీ నివాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పోస్టల్ కాలనీ ఫ్లాగ్ పాయింట్ వద్ద కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ప్రధాన కార్యదర్శి శ్రీ బండారి జనార్దన్ గౌడ్ నాయకత్వం వహించారు. ఇతర కార్యవర్గ సభ్యులు లింగారావు, సుబ్బారావు, సంపత్‌కుమార్‌, రామగోపాలరావు, రుషి, విజయకుమార్‌, ప్రసాద్‌, నవీన్‌, తరుణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు శ్రీ ఐలయ్య గారు మాట్లాడగా రాజయ్య గారు శ్రీ కాళోజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చివర్లో ‘కాళోజీ అమర్ రహే’ నినాదాలు చేశారు.

10468575 f0b2 4024 ae63 59df99830697

f2edd493 7be1 4cf0 9e72 a445bb423c8b

8fd94c0d 890d 4907 9012 3e71b456e495

6c4a9f6b b484 46c0 acc7 0b4a5b32320d

b8a6a6f8 88a8 4a14 bc17 d6d20838b047

c580572e dfca 49dc 9549 8ede6a7f1a8c

fdc8bdb8 2172 46fd bf55 e238ad97e746

c618920f d86f 47fc a18e 22c69f7710b9

8ca61c0f adf2 449c 8a4a 9e54a2f4c130